వెంకటాపురంలో భారీ వర్షం
వెంకటాపురం నుగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పల్లపు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. తొలకరి వర్షాలలో అడపా దడపా కురుస్తున్న వర్షాలతో రైతన్నలు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఆకాశం మేఘావృతం కాగ, దిక్కులు పీక్కుటెల్లి విధంగా ప్రళయ గర్జనలతో అటవి ప్రాంతాల్లో పిడుగులు పడ్డట్టు సమాచారం. ఒక్కసారిగా కురుస్తున్న భారీ వర్షాలతో వేసవి తాపం నుండి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.