Pochampally | సీతక్క పై పోచంపల్లి ఫైర్
- ములుగులో గులాబీ జెండా ఎగరడం ఖాయం
- బడే నాగజ్యోతి భారీ మెజారిటీ సాధిస్తుంది
- మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి
తెలంగాణ జ్యోతి, హన్మకొండ ప్రతినిధి : హనుమకొండ రాంనగర్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు: చేసిన విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లా డుతూ ములుగు ఎమ్మెల్యే సీతక్క ఓడిపోతుందనే అక్కసు తో లేనిపోని ఆరోపణలు చేస్తుందని అన్నారు. బడుగు బలహీన వర్గాల బిడ్డ ఐడిగే నాగజ్యోతి భారీ మెజారిటీ సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఎక్కడికెళ్లినా బిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని దాన్ని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే సీతక్క లేనిపోని ఆరోపణలు చేస్తుందని అన్నారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క ములుగు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు. కెసిఆర్ నాయకత్వంలో ములుగును జిల్లా కేంద్రంగా రెవిన్యూ డివిజన్ చేసిందని అన్నారు. 300 పడకలు గల ఆసుపత్రి నిర్మాణము, మెడికల్ కళాశాలను కూడా మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఒకసారి నేను కేటీఆర్ బినామీ అని అంటు న్నా రని అది రుజువు చేయాలి అని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ములుగు నియోజకవర్గ ప్రజలకు దొంగ నోట్లు, స్పిరిట్ కలిపిన ఆల్కహాల్ ను పంచుతున్నారనే విషయాన్ని ఎక్సైజ్ శాఖ పరిశీలనలోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని అన్నారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం నుండి రూ.80 కోట్లను సీతక్క దిగుమతి చేసుకొని ఎక్కడ పెట్టిందో ప్రజలందరికీ తెలుసు అని, సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి తెలియపరుస్తా మని అన్నారు. ఓడిపోతుందనే భయంతో పసలేని ఆరోపణలు చేస్తుందని దీన్ని ప్రజలంతా కూడా గమనిస్తున్నారని అన్నారు. కరోనా కష్టకాలంలో రిల్స్ కు పరిమితమైంది తప్ప, రియల్ లైఫ్ కు కాదని అన్నారు. ఎక్కడికెళ్లినా ప్రజలంతా కూడా ఆ విషయాన్ని చెప్తు న్నారని అన్నారు. ములుగు చౌరస్తాలో నార్కో అనాలసిస్ పరీక్షలకు నేను సిద్ధం, సీతక్క కూడా సిద్ధమని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో నేనొక జాతీయ నాయకురాలని రాహుల్ గాంధీ ఏ రాష్ట్రానికి వెళ్లిన రాహుల్ గాంధీతోనే పాదయాత్ర చేసినటువంటి సీతక్క ములుగు ప్రజల విశ్వా సాన్ని కోల్పోయారన్నారు. అందుకే ములుగు ప్రజలు జాతీయ నాయకు రాలు మాకు అవసరం లేదనే ఉద్దేశంతో బడిగె నాగజ్యోతికే బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, సీనియర్ నాయ కులు ముల్క రమేష్, కృష్ణ ప్రసాద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.