Pochampalli | కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడిని ఖండిస్తున్నాం
– ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
ములుగు ప్రతినిధి : కేసిఆర్ 10 ఏండ్ల పాలనలో ఎలాంటి మత కల్లోలాలు, దాడులు,కుట్రలు, కుతంత్రాలు లేకుండా జరగకుండా తెలంగాణ అభివృద్ధికోసం అహర్నిశలు కృషి చేశారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దగ్గర గల హరిత హోటల్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రావడానికి ఎన్నో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బాంబుల రాజకీయం తేవాలని చూస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రులను మార్చే కుట్రలతో కాంగ్రెస్ పార్టీ,శాంతి భద్రతలు లేకుండా అశాంతి రగిల్చిన చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. సౌమ్యుడు ప్రభాకర్ రెడ్డిపై దాడి హెయానేయమైన చర్య అని అన్నారు.కొత్త ప్రభార్ రెడ్డి ఎవరిని విమర్శించే వ్యక్తి కాదని,అలాంటి వ్యక్తిపై కాంగ్రెస్ దాడి సరీకాదనీ అన్నారు.కేసిఅర్ నయీం లాంటి దేశ ద్రోహులను కూడా కట్టడి చేశారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భూఖబ్జాలు, గూండాయిజం పెరుగుతుంద న్నారు.ములుగులో మెడికల్ కాలేజీ, ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్,మల్లంపల్లి మండలం ఏర్పాటు చేశారని, ఇలా అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశారని అన్నారు.సీతక్క తనను ఓడించడానికి మంత్రులు వస్తున్నారని కల్లబొల్లి మాటలు చెపుతున్నారని విమర్శించారు. ఛత్తీస్ ఘడ్ నుండి డబ్బుల సంచులు ఎవరు మోసుకొస్తున్నారో ప్రజలకు తెల్సునని అన్నారు. నాయకులను డబ్బుల సంచులతో కొనేది మీరెనని సీతక్కను విమర్శించారు.ఒక్క ఎంపిపికి 20 లక్షలు.సర్పంచ్ కు 10 లక్షలు, వార్డు మెంబర్ కు ఇంత అని అందరిని డబ్బుల సంచులతో కొంటున్నది మీరేనని సీతక్క ను విమర్శించారు. న్యాయంగా ఓటు అడగాలే కానీ డబ్బుల సంచులతో కొనడం మీకే చెల్లిందనీ అన్నారు.50 కోట్ల కర్ణాటక డబ్బులు పంచింది మీరు కాదా..?సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నది మీరు కాదా..? అని ప్రశ్నించారు. నాయకులను,క్రింది స్థాయి కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలో చేరాలని, బెరిరింపులకు గురిచేయడం సరికాదని విమర్శించారు.సీతక్కగా కంటే సంచులక్క,కెమెరక్క అయ్యింది మీరు..అని విమర్శించారు. సీతక్క తెరాస నాయకులకు నేను గెలుస్తానని చెప్పి,కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేను గెలిచి మంత్రి నవుతున్నానని చెప్పడం..ఎవరూ అధికారం లోకి వచ్చినా నేను అందులో ఉంటా అని ఇరు పార్టీ నాయకులను మభ్య పెడుతున్నదని విమర్శించారు. మనం చేసిన పనిని బట్టి ఓటు అడగడం మంచిదన్నారు.కేసిఆర్ వుంటేనే అభివృద్ది,శాంతి భద్రతలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు,రెడ్కో చైర్మన్ ఏరువ సతీష్ రెడ్డి,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, సీనియర్ నాయకుడు గండ్రకోట సుధీర్, పోదెం కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
1 thought on “Pochampalli | కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడిని ఖండిస్తున్నాం”