కెసిఆర్ సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష
– అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లో చేరుతున్నాం
కొత్తగూడ ప్రతినిధి : ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తెలంగాణకు శ్రీరామరక్ష అని, బీ ఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షి తులై పార్టీలో చేరుతున్నట్లు కొత్తగూడ వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు మూడిక సంతోష్ యాదవ్, గుండంపల్లి ఉప సర్పంచ్ కట్టె నగేష్ అన్నారు. బుధవారం కొత్తగూడ మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కట్టె నగేష్,వైఎస్సార్సీపీ మండల ప్రెసిడెంట్ మూడిక సంతోష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కమ్మనబోయిన ఎలందర్ లు ఎమ్మెల్సీ, ములుగు నియోజకవర్గ ఇంచార్జీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, కొత్తగూడ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మనబోయిన వేణు , చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
1 thought on “కెసిఆర్ సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష”