రోడ్డుపై డ్రైనేజీ మురుగునీరుతో పాదచారుల ఇబ్బందులు
ఏటూరునాగారం ప్రతినిది, తెలంగాణ జ్యోతి : ఏటూరు నాగారం రామన్నగూడెం రోడ్డుపై డ్రైనేజీ మురుగునీరు రోడ్డుపై చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డుపై అటు ఇటు వెళ్లే వాహనాలు మురుగునీరుపై నుండి అతివేగంగా వెళ్లడంతో పాదచారులపై డ్రైనేజీ మురుగు నీరు పడి ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా రోడ్డుకు ఇరువైపులా పశువులు కట్టేయడంతో మురుగు నీరు పశువుల పేడతో కలిసి దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు గ్రామపంచాయతీ అధికారులకు తెలిపినా ఎటువంటి చర్య లు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి కైనా అధికారులు డ్రైనేజీ మురుగునీరు రోడ్డుపైకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.