ఏసీబీకి అడ్డంగా దొరికిన పంచాయతీరాజ్ ఏఈ
వరంగల్, తెలంగాణ జ్యోతి : వరంగల్ జిల్లా సంగెం మండలంలో పంచాయతీ రాజ్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న రమేష్ సోమవారం హనుమ కొండలో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికి పోయాడు. వివరాల్లోకెళ్తే.. సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో ఓ ఇంటి నిర్మాణం కోసం బాధితుల నుంచి రూ. 10 వేల డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏఈ రమేష్ అక్రమ ఆస్తుల గురించి అధికారులు సోదాలు నిర్వహి స్తున్నారు.