గూడెల్లి కావ్య ఫౌండేషన్‌ను ప్రారంభించిన పైడాకుల అశోక్
ములుగు, జనవరి 10, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలోని రామాలయం ఆవరణలో శనివారం గూడెల్లి ఓదెలు–కేత దంపతుల కూతురు కావ్య పేరుతో ఏర్పాటు చేసిన గూడెల్లి కావ్య ఫౌండేషన్‌ను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచంద్రతో కలిసి ప్రారంభించారు. దివ్యాంగురాలైన కావ్య తనలాంటి సాటి దివ్యాంగులకు అండగా నిలవాలనే లక్ష్యంతో తల్లి దండ్రుల ప్రోత్సాహంతో ఈ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయడం సంతోషకర మని అశోక్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఫౌండేషన్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్ర మాన్ని ప్రారంభించి దివ్యాంగులకు భోజన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె జయపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చింత నిప్పుల బిక్షపతి, కాంగ్రెస్ మహిళా మండల అధ్యక్షురాలు గుంటోజు పావని, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అభినయ్, ఫౌండేషన్ సభ్యులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.






