Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

Mulugu | మూడోసారి పైడాకులకే ములుగు పగ్గాలు

On: November 22, 2025 9:01 PM

Mulugu | మూడోసారి పైడాకులకే ములుగు పగ్గాలు

Mulugu | మూడోసారి పైడాకులకే ములుగు పగ్గాలు

– డీసీసీ అధ్యక్షునిగా అశోక్​

ములుగు, నవంబర్ 22, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షునిగా పైడాకుల అశోక్​ పగ్గాలు అందుకోనున్నారు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన అశోక్​ కు ఈ పదవి దక్కడం ముచ్చటగా మూడోసారి. 2019లో జిల్లా ఏర్పాటు అయ్యాక డీసీసీ అధ్యక్షునిగా నియామకమైన నల్లెల్ల కుమారస్వామి అకాల మరణంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అశోక్​ రెండో సారి కూడా లాంఛనంగా ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తించారు. మంత్రి సీతక్కకు ప్రధాన అనుచరునిగా పేరు తెచ్చుకున్న ఆయన ములుగు నియోజకవర్గంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి సీతక్క గెలుపుకు తీవ్రంగా కృషి చేశారు. అయితే కాంగ్రెస్​ అధిష్టానం రెండు సార్లు చేసిన వ్యక్తులకు మళ్లీ అధ్యక్ష పదవి దక్కదు అనడంతో కొంత సందేహం కలిగినా రానున్న పంచాయతీ ఎన్నికలతో పాటు జడ్పీ పీఠం ఎస్టీలకు రిజర్వు కావడంతో ములుగు జిల్లా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్ష పీఠం మళ్లీ పైడాకుల అశోక్​ క్​ కే దక్కింది. ఆరుగురి నామినేషన్లలో ఆశావహులందరికీ ఈ నిర్ణయంతో నిరాశే ఎదురైనట్లయింది. కాగా, అశోక్​ మూడోసారి అధ్యక్ష పీఠం ఎక్కనుండటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!