విద్యార్థి దశనుండే సేవా భావం కలిగి ఉండాలి.

Written by telangana jyothi

Published on:

విద్యార్థి దశనుండే సేవా భావం కలిగి ఉండాలి.

– ప్రజా పాలన అంటే ప్రజలకు రాజ్యం వచ్చినట్లు.

– విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి.

– రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : రాష్ట్రంలో ప్రజా పాలన జరుగుతున్నదంటే ప్రజలకు రాజ్యం వచ్చిన ట్లేనని, విద్యార్థినీ విద్యార్థులు చిన్నప్పటి నుండే సేవా భావం కలిగి ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం వెంకటా పురం మండలం కేంద్రం లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే గ్రామస్థాయి నుండి అభివృద్ధి జరగా లని అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు అవుతుందని అన్నారు. పిల్లలు పరిసరాల పరిజ్ఞానంపై అవగాహన పెంచు కోవాలని, ముందస్తు రానున్న ముప్పును ముందుగానే గ్రహిం చి ప్రపంచానికి తెలియజేయాలని సూచించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి పిల్లలు తమ తెలివితేటలతో ముందుకు సాగాలని, 1986లో వరదలు వచ్చి అనేకమంది నిరాసురులైన సందర్భంలో నేను సైతం జోలే పట్టి వరద బాధితులను ఆదుకున్నానని, అదే పరిస్థితి తిరిగి 2022 సంవత్సరంలో వచ్చిన సందర్భంలో దాతల సహాయంతో వరద బాధితులను ఆదుకున్నానని అన్నారు. అటవీ ప్రాంతా ల్లోని విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన బోధన నూతన పరిజ్ఞాన విషయాలు తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాకరం ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థులకు కంప్యూటర్లు ఇతర విద్య పరికరాలు అందిం చడం కోసం సిఆర్ఎస్ ఫండ్ నిధులు కేటాయించడం జరుగు తుందని, ఇదే సమయంలో జిల్లా కలెక్టర్ చోరువతో ఇటీవల హైదరాబాదులో 30 సంస్థలతో సమావేశం నిర్వహించగా పలు సంస్థల ప్రతినిధులు కంప్యూటర్లు అందజేయడానికి పలు గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చా రని హర్షం వ్యక్తం చేశారు. పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని, గ్రామాల అభివృద్ధి చెంది నప్పుడే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రైతులను ఆదుకోవడానికి పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని, గతంలో ఇచ్చిన హామీ ల మేరకు అన్ని సంక్షేమ ఫలాలను రాష్ట్రంలో అర్హులైన వారందరికీ అందిస్తున్నామని సీతక్క తెలిపారు. అనంతరం ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి ని మంత్రి సందర్శించి, ఆసుపత్రిలో రోగులను పరామర్శించి వారికి అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. మంత్రి సంతృప్తి వ్యక్టం చేశారు. ఈ కార్యక్ర మంలో ఏఎస్పి శివం ఉపాద్యాయ, ఆర్డీఓ, ఈ ఈ పంచాయి తి రాజ్ అజయ్ కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారిని, మండల ప్రత్యేక అధికారి, తహసిల్దార్, ఎం పి డి ఓ, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now