సరైన రోడ్డు లేక ఐలాపూర్ గ్రామంలో ఒకరు మృతి
తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం : సరైన రోడ్డు లేక ఒకరు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లాలో చేటుచేసుకుం ది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… కన్నాయిగూడెం మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన పులిసే బాబు శుక్ర వారం మృతి చెందారు. ఆసుపత్రికి వెళ్ళటానికి సరైన రోడ్డు సౌకర్యం ఉన్నట్లు అయ్యితే అంబులెన్స్ (108) ద్వారా తీసు కెళ్తే పులిసే బాబు బ్రతికే వాడని కుటుంబం కంటతడి పెట్టు కుంది. ఈ సందర్భంగా కన్నాయిగూడెం మండల ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ పత్రిక వేలేకరులతో మాట్లాడుతూ…ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన మా ఐలాపూర్ గ్రామ ప్రజల తలరాత మారటం లేదని, అడవిలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి కోసమే అని చెప్పి అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని ఓట్లు వేయించుకొని మరుసటిరోజు ఓట్లు వేసిన ప్రజల అభివృద్ధి మైమరచి రాజభోగం వేలటం సిగ్గు చేటన్నారు. గత 20 సంవత్సరాల నుండి మా గ్రామానికి సరైన రోడ్డు లేదని, అలాగే త్రాగు నీటి సౌకర్యం లేక ప్రజల ఆకలి దప్పికలతో, అనారోగ్యంతో క్షిణించి ప్రతి ఏటా పేద ప్రజలు చనిపోతున్నారన్నారు. ఐలాపూర్ గ్రామానికి అంబు లెన్స్ రాకపోవడంతో తండ్రి చనిపోయి నెలలు కాకముందే శుక్రవారం పులిసే బాబు తండ్రి నాగయ్య చనిపోవడం బాధా కరమని, అతని ఇద్దరు బాలికలు, ఒక బాలుడు వారి కుటుం బం రెక్కాడితే డొక్కాడని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు పిల్లలు అనాదలుగా ఉండటంతో ప్రభుత్వం వారి కుటుం బాన్ని ఆర్ధి కంగా ఆదుకోవాలని డిమాండ్ చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయితే మా బ్రతుకులు మారుతాయి కావ చ్చనే ధీమా తో ఉంటున్నామన్నారు. ఐలాపూర్ గ్రామానికి కనీస మౌలిక సౌకర్యాలు లేక, మండల కేంద్రానికి వెళ్లేందుకు సుమారు 12 కిలోమీటర్లు ఉందని, మంత్రి సితక్క చొరవ తీసుకుని వెంటనే తారు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.