ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కరింగ్ వేస్తున్న అధికారులు.
– పరిశీలించిన డిపిఓ దేవరాజ్
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : ఎనుమరేషన్ బ్లాక్ లో ఇళ్ల జాబితా తయారీ పకడ్బందీగా చేపట్టాలనీ, ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కరింగ్ వెయ్యాలనీ డిపిఓ దేవరాజ్, ఎంపీడీవో మూడు రాజు, సూపర్వైజర్ అలువాల రవి పేర్కొన్నారు. శుక్రవారం వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామం లో ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కరింగ్ ఎలా వేస్తున్నారని పరిశీలిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 వ తేదీ నుండి చేపట్టే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా హౌస్ లిస్టింగ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కరింగ్ చేస్తున్న తీరును పరిశీ లించి గ్రామంలోని ప్రజలకు అవగాహన చేశారు. ఈ కార్యక్ర మంలో పంచాయతీ కార్యదర్శి దుర్గ ప్రసాద్, ఎనుమరేటర్లు గోస్కుల లక్ష్మణ్ ,మునిగాల రామకృష్ణ ,మధ్యల సంధ్య,కొండ మాధవి, ఇంచర్ల గీత, పంచాయతీ సిబ్బంది సహాయకులు తదితరులు పాల్గొన్నారు.