ఉరివేసుకొని ఒకరు మృతి
తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం: మండలంలోని బుట్టా యిగూడెంలో డాలయ్య( 50)అనే వ్యక్తి ఉరివేసుకొని మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఏటూరు నాగారం మండలం రొయ్యురు గ్రామానికి చెందిన కావిరి డాలయ్య అనే వ్యక్తి సమీప బంధువు మరణిస్తే బుట్టయి గూడెం గ్రామానికి చెందిన జనగం ఎల్లయ్య అనే వృద్ధుడి గుడిసెలో గత వారం రోజుల నుండి ఉంటున్నాడు. మంగళ వారం అర్ధరాత్రి ఎవరులేని సమయాన తాడుతో గుడిసెలో ఉన్న దూలానికి ఉరి వేసుకొని చనిపోయాడు. తన భార్య మల్లక్క పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్ తెలిపారు.