19 న బెస్తగూడెం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణం.

19 న బెస్తగూడెం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణం.

– కళ్యాణ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావాలని ఆలయ కమిటీ ఆహ్వనం 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం బెస్త గూడెం పంచాయతీ కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ వినాయక స్వామి ఆలయంలో ఈనెల 19 తేదీన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు, ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాల అలంకరణ చేసి, భక్తుల సౌకర్యార్థం విస్తృతమైన ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.ఈనెల 19వ తేదీ సోమవారం ఉదయం ఏడు గంటల నుండి శ్రీ ఉమామహేశ్వర పురస్పర సిద్ధి లక్ష్మి సహిత పంచాయతన ఏకదంత వరుసిద్ది వినాయక స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవ మరియు కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్ఛల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహిం చేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు నిర్వహించింది. ఈ మేరకు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ కమిటీ చుట్టుపక్కల గ్రామాల్లో భక్తులకు, గ్రామ పెద్దలకు, రైతులకు, వ్యాపారులకు స్వామివారి కల్యాణ మహోత్సవ ఆహ్వాన శుభ పత్రికలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టింది. మంగళ వాయిద్యాలతో, భక్తుల జయ జయ ద్వానాలతో వేద పండితుల మంత్రోచ్ఛరణలతో కళ్యాణ మహోత్సవాన్ని మహా వైభవంగా నిర్వహించేందుకు, దైవజ్ఞ లు సోమవారం 19వ తేదీ నీ ముహూర్తం నిర్ణయించారు. ఉదయం ఏడు గంటలకు గణపతి పూజ, మండపారాధన, కలశపూజ, అగ్ని ప్రతిష్టాపన, లక్ష్మీ గణపతి హోమం, రుద్ర హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిం చేందుకు శ్రీ ఏగదంత వరసిద్ధి వినాయక స్వామివారి కల్యాణ మహోత్సవ ఇష్టపురి బెస్తగూడెం కమిటీ వారు, జై గణేశ జై జై గణేశా అనే నామస్మరణతో విస్తృత మ్మన ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులకు స్వామివారి అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిం చేందుకు ఏర్పాటు చేశారు. స్వామివారి కల్యాణ మహోత్స వానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఈ సందర్భంగా ఆలయ కమిటీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment