Medaram : మేడారంలో హలాల్ నిషేధం..!
– అలా చేస్తే అమ్మవారికి మొక్కుచెల్లనట్టే…
– ప్రధాన పూజారి సిద్దబోయిన అరుణ్
ములుగు, తెలంగాణ జ్యోతి : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మల దగ్గరికి తరలివచ్చే భక్తులు అమ్మవార్లకు మొక్కుల చెల్లింపులలో హలాల్ చేయొద్దని, ఆదివాసి సంప్ర దాయాలను కాపాడాలని ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ కోరారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు… ఆదివాసి సంప్రదాయాలను గౌరవిస్తూ సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుని తల్లుల సేవలో తరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా హలాల్ చేసేందుకు ప్రయత్నించేవారు జాతరకు రావద్దని పేర్కొన్నారు. ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలను తప్పకుండా గౌరవించాలని కోరారు.