అధికారులు వివక్ష విడనాడాలి 

అధికారులు వివక్ష విడనాడాలి 

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ స్థానిక అధికారులు పాల్గొ నక పోవడం పట్ల కాటారం మండలం బి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు రామిళ్ళ కిరణ్ ఆక్షేపణ వ్యక్తం చేశారు. చాక లి ఐలమ్మ విగ్రహం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడక పోవడం రజక వృత్తిని అవహేళన చేసినట్లేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అధికారులు ప్రభుత్వంలో ఉన్న పెద్దల కుటుంబ సభ్యులకు సంబంధించిన జయం తి ఉత్సవాలను మాత్రం ఆర్భాటంగా చేశారని అన్నారు. రజాకారుల పైన దొరలపై సవాల్ చేసి మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన వీరనారి చాకలి ఐలమ్మ జీవితం ఎంతోమందికి ఆదర్శనీయమని ఆయన అన్నారు. అధికారులు వివక్ష విడనాడి అందరినీ సమదృష్టితో చూడాలి కిరణ్ కోరారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment