అధికారులు అప్రమత్తంగా ఉండాలి : సీపీ శ్రీనివాస్
అంతరాష్ట్ర సరిహద్దు సిర్వాంచ బ్రిడ్జ్, అర్జున్ గుట్ట ఫెర్రి పాయింట్, ప్రాణహిత వరద ఉదృతి పరిశీలన
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణహిత, గోదావరి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తు న్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఆదేశించారు. మంచిర్యాల జోన్ కోటపల్లి మండలం లోని అంతరాష్ట్ర సరిహద్దు బ్రిడ్జ్, అర్జున్ గుట్ట వద్ద ఉన్న ఫెర్రి పాయింట్ సందర్శించి ప్రాణహీత వరద ఉదృతిని పరిశీలించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లా డుతూ గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రాణహిత వరదల వలన తలెత్తిన పరిస్థితులను పర్యవేక్షించి పరివాహక ప్రాంత చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయి ఎలాంటి అవసరమైన సహాయ చర్యలు అందించేందుకు తెలుసుకోవడం కోసం ఈ ప్రాంతాలను సందర్శించినట్లు తెలిపారు. వరదల వలన ఇబ్బంది ఏర్పడిన సమయంలో రక్షణ చర్యలు చేపట్టేందుకు వెంటనే స్పందించి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడడం కోసం శిక్షణా పొందిన సిబ్బంది తో పాటు ఒక వాటర్ బోటు, వివిధ రక్షణ పరికరాల ద్వారా కూడిన డిడిఆర్ఎఫ్ (డిస్టిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) పోలీసు టీమ్ ఎల్లపుడు అందుబాటులో ఉంచడం జరిగింది అని తెలిపారు. పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడం, లో లెవెల్ బ్రిడ్జ్ లు మునిగి రహదారుల ఫై నుండి వరద ప్రవహించడం వలన రవాణా రాకపోకలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారు అన్నారు. ముంపునకు గురైన ప్రజలు ఎవ్వ రూ అధైర్య పడవద్దని, అన్ని శాఖల అధికారుల సమన్వ యంతో జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబా టులో ఉంటారని తెలిపారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసువారి సహాయం పొందా లని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల, వరదల వలన ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీపీ అధికారులను ఆదేశించారు. అత్యవస రమయితే తప్ప బయటకి రావద్దని ఉదృతంగా ప్రవహిస్తున్న నదులను పొంగిపొర్లుతున్న వరద నీటిని, జలపాతం లను, చెరువులను, వాగులను చూడటానికి బయ టికి వచ్చి ప్రమాదాల బారిన పడవద్దని విజ్ఞప్తి చేశారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మి న్ సి. రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధా కర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్ తదితరులు ఉన్నారు.