అంగన్వాడి కేంద్రాలలో పోషణ పక్వాడ వారోత్సవాలు
-అక్షరాభ్యాసం… శ్రీమంతం …
కాటారం, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ వారోత్స వాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం మండలంలోని అంకుసాపూర్ అంగన్వాడీ కేంద్రంలో అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించారు సూపర్వైజర్ శివ రాణి మాట్లాడుతూ తల్లులకు చిరుధాన్యాలు గురించి తయారుచేసిన ఆహార పదార్థాల ప్రాము ఖ్యత, పోషకాహార లోపం లేకుండా పౌష్టికాహారం తీసుకోవాలని తల్లులకు వివరించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం గర్భిణి మహిళలకు, సీమంతం, అల్లీపూర్ అంగన్వాడి కేంద్రంలో చిరు దాన్యాల ఆవశ్యకత వాటిలో ఉండే పోషక పదార్థాలపై అవగా హన కల్పించారు. పిల్లలకు చేతులు కడుక్కోవడం పరిశుభ్రత విషయాలపై బోధించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శివ రాణి అంగన్వాడి టీచర్లు ముసుకుల శ్రీలత రెడ్డి, షహేదా బేగం, శ్రీలత, ఆశాలు రెహమత్, సర్దార్ బి చిన్నారులు తల్లులు, గర్భిణీ మహిళలు పాల్గొన్నారు.