పలు ప్రైవేటు ఆసుపత్రులకు నోటీసులు జారీ
-వైద్య ఆరోగ్యశాఖ మంత్రి,జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీలు
-ఆసుపత్రిలో పరిశుభ్రత పాటించాలి
-జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య
ఏటూరునాగారం, తెలంగాణజ్యోతి : ఏటూరునాగారం మండల కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాషా హాస్పిటల్ ఏటూరు నాగారం ప్రైవేటులో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులకు ఆసుపత్రిని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లో పేర్కొన్న దాని ప్రకారంగా నడపాలని ఆదేశించారు. పేషంట్ కేస్ షీట్ ను ఇన్ పేషెంట్లకు తప్పని సరిగా పేషెంట్ కు సంబంధించిన, వ్యాధికి సంబంధించిన సమాచారాన్ని పొం దుపరచాలని, ఆసుపత్రి బెడ్స్ స్థాయిని అనుమతి తీసుకున్న దాని ప్రకారం మాత్రమే ఉపయోగిం చాలన్నారు. పేషంట్స్ కు సంబంధించిన సేవలకు వాటి యొక్క ప్రైస్ లిస్ట్ రిసెప్షన్ కౌంటర్ వద్ద ప్రదర్శించాలని, ఆస్పత్రి ఆవరణలో కానీ ఆసుపత్రిలో కానీ పరిశుభ్రత పాటించాలని, మలేరియా డెంగు టైఫాయిడ్ లాంటి సంక్రమణ వ్యాధులకు సంబంధించిన రోగనిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిన వారు లేదా చికిత్స కొరకు వచ్చిన వారి వివరాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు తెలుపాలని ఆదేశించారు. వీటికి సంబంధించి పాషా హాస్పిటల్ కు నోటీసు అందజేశారు. అనంతరము ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆరాధ్య ప్రైవేట్ హాస్పిటల్ ఏటూరునాగారంను తనిఖీ నిర్వహించి వారికి నోటీసు జారీ చేశారు. జిల్లాలో ఎవరైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అనుమతి లేకుండా ఆస్పత్రులు, రోగనిర్ధారణ పరీక్షల కేంద్రా లు నిర్వహించినట్లయితే తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010ప్రకారం శిక్షలకు గురి అవుతారని హెచ్చరిం చారు. ఆసుపత్రులు నిర్వహించు వారు లేదా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వారు ముందస్తుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తులో పేర్కొన్న దాని ప్రకారంగా సరియైన డాక్యుమెంట్స్ సమర్పించి అనుమతి తీసుకున్న తర్వాతనే ఆసుపత్రి గాని లేదా రోగనిర్ధారణ పరీక్ష కేంద్రం గానీ నడపాలన్నారు. లేనట్లయితే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.