వాజేడు ఉన్నత పాఠశాల లో నో బ్యాగ్ డే కార్యక్రమం

Written by telangana jyothi

Published on:

వాజేడు ఉన్నత పాఠశాల లో నో బ్యాగ్ డే కార్యక్రమం

వెంకటాపురం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు నాగారంలో “నో బ్యాగ్ డే” సందర్భంగా విద్యార్థులతో కలిసి పాఠశాల ఉపాధ్యాయులందరు మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ గోదాంను క్షేత్ర పర్యటనలో భాగంగా సందర్శించడం జరిగింది. విద్యార్థులు విన్న అంశాల కంటే ప్రత్యక్షంగా చూసిన అంశాలను ఎక్కువగా గుర్తుంచుకుంటారని వారికి ప్రత్యక్ష అవగాహనను కలిగించుటకు విద్యార్థులను భారత్ గ్యాస్ గోదాం సందర్శన చేయించడం జరిగిందని  ప్రధానోపా ధ్యాయులు సోయం ఆనందరావు అన్నారు. ఎల్పీజీ గ్యాస్ వినియోగాన్ని మరియు గ్యాస్ వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలను, అలాగే గ్యాస్ నిల్వ చేసే పద్ధతులు, గ్యాస్ ప్రమాదాలు జరిగే పరిస్థితులు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి జిల్లా వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు, ఆంగ్ల ఉపాధ్యాయుడు చల్ల గురుగుల మల్లయ్య వివరించడం జరిగింది. ఇలాంటి క్షేత్ర పర్యటన ద్వారా అనేక సామాజిక, జీవన నైపుణ్యాలను తెలుసుకుంటారని పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు పోరిక స్వరూప్ సింగ్ అన్నారు. భారత్ గ్యాస్ నిర్వాహకులు కొండ్ర అభిషేక్ ఎల్పీజీ గ్యాస్ స్టవ్ పరికరాలను తరచూ పరిశీలించాలని, గ్యాస్ వినియోగంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చాలా విషయాలను విద్యా ర్థులకు వివరించడం జరిగింది. విద్యార్థులు విద్యార్థి దశ నుండే విజ్ఞానాన్ని నేర్చుకొని భవిష్యత్తులో మంచి మార్గంలో నడవడానికి చిన్ననాటి నుండే పరిసరాల పరిశీలన, సామా జిక అవసరాలు, వాటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు, అందు కు కావలసిన జ్ఞానాన్ని పొందడానికి ఈ క్షేత్ర పర్యటనలు చాలా ఉపయోగపడతాయని అన్నారు. అందుకోసమే స్థానిక గ్యాస్ గోదాంను సందర్శించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయులు రంగు ఆనంద్, పోరిక రవికుమార్, నూనవత్ శ్రీకాంత్, బొగ్గం కుమార్ బాబు,కంచు ప్రభాకర్, తెల్లం రాజ్యలక్ష్మి, షిందే రాజేష్,జర్పుల వస్య పర్యవేక్షణలో విద్యార్థులను సందర్శనకు తీసుకెళ్ళి, విద్యార్థులకు గ్యాస్ మన అవసరాలకు ఏవిధంగా,ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నామో, మొదలగు విషయా లన్ని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులను చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణతో క్షేత్ర పర్యటన విజయవంతం చేయడానికి సహకరించడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసి అందుకు సహకరించి నందుకుగాను పాఠశాల తరపున ప్రధానోపాధ్యాయులు తరఫున పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు కోకిల శ్రీరంగం, గ్యాస్ గోదాం ఆపరేటర్ కృష్ణవేణి, ఎన్.సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశా రు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చాలా ఉపయోగప డతాయని, జ్ఞానాన్ని పొందుటకు విద్యార్థులకు ఉపయుక్తం గా ఉంటాయని, ప్రతినెల నో బ్యాగ్ డే సందర్భంగా విద్యార్థు లందరు ఏదో ఒక కార్యాలయాన్ని గానీ లేదా ఏజెన్సీని గాని సందర్శించి ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోవాలని, క్షేత్ర పర్యటనలో నో బ్యాగ్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దిగ్వి జయం చేసినందుకు మండల విద్యాధికారి టి. వెంకటేశ్వర రావు పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now