మహిళల అక్షరాస్యతకు ఎన్‌ఐఓఎస్ పరీక్షలు
500 మంది మహిళలకు పరీక్షలు
కేంద్రాన్ని సందర్శించిన ఉల్లాస్ కోఆర్డినేటర్ డా. కృష్ణ బాబు
వెంకటాపురం నూగూరు, మార్చి 29, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలంలో ఆదివారం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) ఆధ్వర్యంలో మహిళల అక్షరాస్యత కోసం పరీక్షలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన 27 పరీక్షా కేంద్రాల్లో వయోజన విద్య పూర్తిచేసిన సుమారు 500 మంది మహిళలు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వాజేడు మండలం మురుమూరు కాలనీ గ్రామంలోని పరీక్షా కేంద్రాన్ని ములుగు జిల్లా ఉల్లాస్ కోఆర్డినేటర్ డాక్టర్ కృష్ణ బాబు సందర్శించి నిర్వహణను పరిశీలించారు. కార్యక్రమంలో డిపిఎం కమలా, ఎంఈఓ టి. వెంకటేశ్వర్లు, సర్పంచ్ మడకం సుభద్ర, ఏపీఎం సతీష్, వీఓఏలు సంధ్యారాణి, జయలలిత, సీసీలు మల్లీశ్వరి, సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్లు, ఎంపీపీ ఎస్ మురుమూరు కాలనీ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.









