మద్యం లైసెన్స్ షాపుల్లో స్టాక్ నిల్ –  బెల్ట్ షాపుల్లో ఫుల్ స్టాక్

Written by telangana jyothi

Published on:

మద్యం లైసెన్స్ షాపుల్లో స్టాక్ నిల్ –  బెల్ట్ షాపుల్లో ఫుల్ స్టాక్

  • యధేచ్చగా ఎన్నికలు కోడ్ ఉల్లంఘణ. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లో లైసెన్సు మద్యం షాపుల్లో ఉన్న నిల్వలను బెల్టు షాపులకు విక్రయించడంతో, మూసివేసి న ఉన్న బెల్టు షాపులు ఎలక్షన్ కోడ్ నియమ నిబంధనలకు విరుద్ధంగా తిరిగి తెచ్చుకున్నాయి. వెంకటాపురం మండలం లో రెండు మధ్యం షాపులు, వాజేడు మండలంలో రెండు లైసెన్స్ మద్యం షాపులలో బతుకమ్మల నిమజ్జనం పండుగ, మరియు దసరా పండుగలను పురస్కరించుకొని,రెండుమండలాల మద్యం మాఫియా సుమారు మూడు కోట్ల రూపాయలుకు పైగా విలువైన మద్యాన్ని బెల్టు షాపులకు, రాజకీయ పార్టీలకు గుట్టు సప్పుడు కాకుండా విక్ర ఇంచినట్లు పలువురు మద్యం ప్రియులు చర్చించుకుంటున్నారు. భారత ఎన్నికల కమీషన్ ఆదేశం పై ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నాటి నుండి అధికారులు అప్రమత్తంఅయ్యారు. గొలుసు కట్టు ,బెల్ట్ షాపుల పై రైడింగ్ చేసి అక్రమ మద్యం,గుడుంబా విక్రయిదారులపై ఎక్సైజ్ అండ్ ప్రొఫెషన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి బెల్ట్ షాపులు, గుడుంబా వ్యాపారులపై ఉక్కు పాదం మోపారు. అయితే ఇటివల కాలం నుండి లైసెన్స్ మద్యం షాపుల నుండి సుమారు మూడు కోట్ల రూపాయలకు పైగా విలువైన బ్రాండెడ్ ,మరియు ఇతర బ్రాండ్ల మధ్యం నిలువలు బెల్ట్ షాపులకు తరలిపోయినట్లు పలువురు మద్యం ప్రియులు చర్చించుకుంటు న్నారు. బతకమ్మలు ,దసరా పండుగ సంధ్ ర్భంగా యదేచ్ఛగా పాన్ షాపులు,కిరాణా బడ్డీ లు ,బెల్టుషాపులు లో మద్యాన్ని అధిక ధరలతో ఎలక్షన్ కోడ్ నియమ నిబంధనకు విరుద్ధంగా ఎంఆర్పీ ధరకు కంటే వందరూపాయలవరకు అధిక ధరలకు విక్రయాలు జరుపు తున్నట్లు మద్యం ప్రియులు మీడియా ముందు ఆరోపించారు. అధిక ధరలకు విక్రయించి మద్యం ప్రియులను దోచుకుంటున్నారు. లైసెన్స్ షాపులకు వెళ్లి మద్యం కొనుగోలు చేసే కొనుగోలుదారులకు నో స్టాక్ అంటూ అక్కడ సిబ్బంది సమాధానం ఇస్తున్నారని తెలిపారు. దీంతో ఒక్కసారిగా బెల్ట్ షాపులలో రకరకాల బ్రాండ్ల మద్యం యదేచ్చగా విక్రయూలు జరుపుతున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రస్తుత సమయంలో అట్టపెట్టలతో బాక్సులు, బాక్సులు సైతం లక్షల రూపాయల వ్యయంతో బెల్ట్ షాపులు యజమానులు మద్యం కొనుగోలు చేసి గ్రామాల్లో గుట్టు సప్పుడు కాకుండా దొడ్డి దారిన విక్రయాలుజరుతున్నార ని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అధికారులను,పలుకు బడిన మద్యం మాఫియా పండగ వరకు బెల్ట్ షాపులు వైపు కన్నెత్తి చూడద్దని కేసులు పెట్టవద్దని లక్షల్లో నజరాణాలు చెల్లించినట్లు పలువురు గుసగుసలతో చెవులు కొరుక్కుంటున్నారు.అదే విషయం చర్చించుకుంటున్నారు. బెల్ట్స్ షాపుల దందా గిరి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన పై పలువురు మద్యం ప్రియులు ములుగు జిల్లా కలెక్టర్, ములుగు జిల్లా పోలీస్ సూపర్డెంట్ లకు చరవాణిల ద్వారా ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.

Tj news

1 thought on “మద్యం లైసెన్స్ షాపుల్లో స్టాక్ నిల్ –  బెల్ట్ షాపుల్లో ఫుల్ స్టాక్”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now