అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ నిమజ్జన కార్యక్రమాలు
- భక్తి పారవశ్యంతో బతుకమ్మల నిమజ్జనం
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం బతుకమ్మల పండుగ ఆదివారం నాటికి ముగియటంతో సద్దుల బతుకమ్మను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి, బాధాతప్త హృదయాలతో మహిళా సోదరీమణులు భాజా భజంత్రీలు తో బతుకమ్మల డి.జె. పాటల తో ఊరేగింపుగా సమీపంలోని నదులు, వాగులు చెరువులలో ఆదివారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం వరకు బతుకమ్మ ల నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులు పాటు గ్రామాల్లో బతుకమ్మల సందడి తో పూల పండగ బతుకమ్మల డీజే పాటలతో అర్ధరాత్రి వరకు బతుకమ్మల ఆటపాటలతో మహిళా సోదరీమణులు గౌరమ్మను భక్తిశ్రద్ధలతో పూజించి, బతుకమ్మల పాటలతో అలరింపజేశారు. వారి, వారి గృహాల్లో చుట్టుపక్కల వీధుల్లోని ఇళ్ల వద్ద పూలను సేకరించి, పూల పండుగ బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో పాటలతో ఆడి పాడి గౌరమ్మ దేవతను పూజించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం నుండి బతుకమ్మలను అందంగా అలంకరించి న మహిళా సోదరీమణులు భాజా భజత్రీలు డిజే పాటలతో బల్లకట్టు, కంకల వాగు, ఆయా గ్రామాల సమీపంలోని గోదావరి నదులలో , వాగులు, వంకలు చెరువులలో సోమవారం ఉదయం వరకు నిమజ్జనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉదయం 11 గంటల వరకు బతుకమ్మల నిమజ్జనా కార్యక్రమం సందడి నెలకొంది. చల్లగా రావమ్మ వచ్చే ఏడాది గౌరమ్మ తల్లిని మళ్ళీ బతుకమ్మలతో పూజిస్తామని, సకల జనులు సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలు సక్రమంగా పండాలని అష్ట ణ శ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగించాలని గౌరమ్మ బతుకమ్మ తల్లిని ఈ సందర్భంగా మహిళా సోదరీమణులు కొబ్బరికాయలు కొట్టి, పసుపు కుంకాలతో గంగానమ్మ ఒడిలోకి సాగనంపారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు భక్తిశ్రద్ధలతో ఆడి, పాడి గౌరమ్మను పూజించి, వచ్చే ఏడాది వరకు సకల జనులు సంయుక్తంగా గ్రామాల వారిగా వీధీ వీధీన బతుకమ్మ లను స్వాగతిస్తామని ఈ సందర్భంగా మహిళా సోదరీమణులు వేడుకున్నారు.