టేకులగూడెంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు
– ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అవగాహన.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఎస్పీ ఆదేశంపై నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధి వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జి. కృష్ణ ప్రసాద్ ఆదివారం టేకులగూడెం గ్రామంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు, ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎటూరు నాగారం ఏ.ఎస్పీ శివం ఉపాధ్యాయ పర్యవేక్షణలో వెంకటాపురం సిఐ బండారి కుమార్ సూచనల మేరకు రోడ్డు సేఫ్టీ, డైల్ 100, రోడ్డు భద్రత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, చరవాణి మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని, ఓవర్ లోడ్ తో ప్రయాణాలు ప్రమాదకరమని, తదితర అంశాలపై టేకులగూడెం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. డయల్ 100 ప్రాముఖ్యతపై ప్రజలకు వివరించారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడిపితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. సురక్షితం గా వాహనాలు నడిపి, క్షేమంగా ఇల్లు చేరు కోవాలని తదితర జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో పేరూరు ఎస్సై జి. కృష్ణ ప్రసాద్, సివిల్, మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.