పల్లెకు పోదాం .. పండగ చేద్దాం చలో చలో…

పల్లెకు పోదాం .. పండగ చేద్దాం చలో చలో...

పల్లెకు పోదాం .. పండగ చేద్దాం చలో చలో…

– కిటకిటలాడుతున్న బస్టాండ్లు 

– పిండి వంటల గుమగుమలు 

    వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : సంక్రాంతి పండగ సందర్భంగా ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లో పండక్కి నాలుగు రోజులు ముందే సందడి నెలకొన్నది. పిండి వంటల గుమ,గుమలు కొత్త అల్లుళ్ల రాకపోకలతో గ్రామాల్లో పండగ వాతావరణం సంతరిం చుకున్నది. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న కుటుం బాలు పుట్టి పెరిగిన గ్రామాలకు కుటుంబాలతో సైతం తరలి వస్తున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా పిండి వంటలు తయారు చేసుకునేందుకు, పిండి పట్టించుకునే గిర్నీల వద్ద ప్రజలు క్యూలు కట్టారు. ఇళ్లన్నీ బూజులు దులిపి శుభ్రంగా కడుక్కొని, ముత్యాల ముగ్గులు, రంగ వల్లులతో మహిళా సోదరిమణులు తయారు చేసుకుంటున్నారు. పండగలకు వెళ్లేవారు, వచ్చే వారితో ఆర్.టి.సి బస్సులు, ప్రైవేటు వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. వర్తక వాణిజ్య సంస్థలు, బట్టల దుకాణాలు, బంగారం దుకాణాలు, ఫ్యాన్సి షాపులు పండగ సందర్భంగా కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి. ఇల్లు, వాకిళ్ళ ముందు సంక్రాంతి పండగ సందర్భంగా ముగ్గులు వేసేందుకు రకరకాల రంగుల దుకాణాలు వెంకటాపురం పట్టణం మార్కెట్లో చౌక ధరలకు వ్యాపారులు పోటీలు పడి విక్రయిస్తున్నారు. వాకిళ్ళ ముందు రంగు రంగుల ముగ్గులతో, రంగవల్లులతో అలంకరించుకునేం దుకు, రంగుల విక్రయ దుకాణాల వద్ద, మహిళా సోదరీమణు లు కొనుగోల్లతో హడావిడి చేస్తున్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, వేకువజామునే డూడూ బసవన్నల మేళాలతో రైతుల ఇళ్ల వద్ద  సంక్రాంతి పండుగకు శ్రీకారం చుట్టారు. పండగ సందర్భంగా వ్యవసాయ పనులకు సైతం కూలీలు పండగ సెలవులు ప్రకటించటంతో వ్యవసాయ పనులకు పాక్షికంగా బ్రేకులు పడ్డాయి.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment