మహాదేవపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పరుశమేని నగేష్ యాదవ్.
తెలంగాణ జ్యోతి, మహాదేవపూర్ : మహాదేవపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా అన్నారం గ్రామానికి చెందిన పరుశమేని నగేష్ యాదవ్ నియామక మయ్యారు. ఈ సందర్భంగా ఆయన నియామకానికి కృషిచేసిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఆయన సోదరుడు దుద్దిల్ల శీను బాబుల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.