మున్నూరుకాపు సంఘం ములుగు కమిటీ ఎన్నిక

On: March 29, 2026 8:46 PM

మున్నూరుకాపు సంఘం ములుగు కమిటీ ఎన్నిక

మున్నూరుకాపు సంఘం ములుగు కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా పిట్టల మధుసూదన్, ప్రధాన కార్యదర్శిగా పౌడాల ఓంప్రకాష్

ములుగు, మార్చి 29, తెలంగాణ జ్యోతి: శ్రీ బాలాజీ మున్నూరు కాపు పరపతి సంఘం ములుగు నూతన కమిటీని ఆదివారం గట్టమ్మ సమీపంలో నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షుడిగా పిట్టల మధుసూదన్, ఉపాధ్యక్షుడిగా అనుమూల సురేష్, ప్రధాన కార్యదర్శిగా పౌడాల ఓం ప్రకాష్, కోశాధికారిగా సముద్రాల రఘుతో పాటు కార్యవర్గ సభ్యులుగా గుండ్రాతు జయాకర్, రాణా ప్రతాప్, సూర రఘు, గుండ బిక్షపతిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పిట్టల మధుసూదన్ పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం బలోపేతం, సంస్కరణలు, సంఘ అభివృద్ధి, సభ్యుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. సంఘ నిర్మాణాన్ని మరింత బలపరచి సభ్యుల ఐక్యతను పెంపొందించే దిశగా కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. అలాగే యువతను సంఘ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘ భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించి, సభ్యుల ఐక్యతతో సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు పాల్గొ న్నారు. అనంతరం నూతన కమిటీని సంఘసభ్యులు అభినందించారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!