మానవత్వం చూపిన ములుగు జిల్లా పోలీసులు.
– ప్రాణాలకు తెగించి మునిగిపోయిన వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసిన అధికారులు
– మృతదేహాన్ని రెండు కిలోమీటర్ల మేర మోసి కుటుంబ సభ్యులకు అప్పగింత
ములుగు, తెలంగాణ జ్యోతి : ప్రాణాలకు తెగించి దయ్యాల మడుగులో మునిగి పోయిన వ్యక్తి మృత దేహాన్ని వెలికి తీసి మానవత్వం చూపిన ములుగు జిల్లా పోలీసులని శభాష్ అనిపించుకుంటున్నారు. విధి నిర్వహణలో కఠినంగా ఉండే పోలీసులు కష్టాల్లో ఉన్నవారికి ప్రాణాలు లెక్క చేయకుండా మానవత్వంతో సహాయం చేస్తారని ములుగు జిల్లా పోలీసు లు రుజువు చేశారు. వివరాల్లోకి వెళ్తే …. హైదరాబాద్ పట్టణా నికి చెందిన రోహిత్ లాల్ (21) మేడారం జాతరకు వచ్చి చిలకలగుట్ట వెనుకాల గల దయ్యాల మడుగు ప్రదేశంలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. సమాచా రం అందుకున్న సిసిఎస్ సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్బిఐ ఇన్స్పెక్టర్ కిరణ్, కానిస్టేబుల్ శంకర్ ప్రాణాలకు తెగించి రెండు గంటలపాటు మృతదేహం కోసం ముమ్మరంగా గాలించి ఎట్టకేలకు మృతుడి శవాన్ని గుర్తించారు. సంఘటన స్థలానికి వాహనం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రెండు కిలోమీటర్ల మేర స్వయంగా మోస్తూ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్ప గించారు. పోలీసులు చేసిన సాహసం, సహాయం ప్రతి ఒక్కరి అభినందనలు అందుకుంది. కాగా మృతదేహాన్ని అందుకున్న పోలీస్ అధికారులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజే శారు. ఏది ఏమైనా పోలీస్ అధికారుల పనితీరు, కష్ట సమ యంలో చూపిన మానవత్వం అందరి మన్ననలను అందు కుంటున్నారు.