అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన ములుగు సీఐ రంజిత్ కుమార్

Written by telangana jyothi

Published on:

అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన ములుగు సీఐ రంజిత్ కుమార్

ములుగు తెలంగాణ జ్యోతి : ఈనెల 14 నుండి 20 వరకు నిర్వహించే అగ్నిమాపక శాఖ వారోత్సవాలను శనివారం ములుగు అగ్నిమాపక కేంద్రాధికారి ఎం.డి అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో నిర్వహించనున్న వారోత్స వాల పోస్టర్లను ములుగు సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14 ముంబైలోని విక్టోరియా రాక్ యార్డ్ నౌకలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్నిమాపక దళ సిబ్బంది కర్తవ్య విధి నిర్వహణలో అమరులైన కారణంగా వారి స్మారకార్ధంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు ఈ అగ్నివాక వారోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారన్నారు.  దానిలో భాగంగానే ఈరోజు ములుగు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఈ వారోత్సవాల్లో ఏప్రిల్ 14 నుండి 20 వరకు రోజు వారిగా స్కూళ్లు, కాలేజీలు, గ్యాస్ గోదాములు, రైస్ మిల్లులు, పత్తి మిల్లులు, సినిమా టాకీసులు, పెట్రోల్ పంపులు, సూపర్ మార్కెట్, బస్టాండ్ ప్రాంగణం లో, ఆసుపత్రులు మరియు జన సాంద్రత ఎక్కువ ఉన్న ప్రదేశాలకు వెళ్లి అగ్ని ప్రమాదం జరగకుండా మరియు అగ్ని ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏ విధంగా ఉంటాయో అగ్నిమాపక సిబ్బంది వారి యొక్క విన్యాసాలను మాక్ డ్రిల్స్ ద్వారా చేస్తూ వారోత్సవాలను కొనసాగిస్తారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది టీ. నగేష్ ఎల్ ఎఫ్, పై.మధు సుధన్ డ్రైవర్, ఆపరేటర్ భార్గవ్ లు పాల్గొన్నారు.

Leave a comment