శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన దుర్గామాత
ములుగు ప్రతినిధి : శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాల్గవ రోజు అమ్మవారు శ్రీ మహా లక్ష్మి అవతారంలో భక్తులకు దర్శన మిచ్చారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండపం వద్ద ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ యాదవ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో గట్ల సత్యనారాయణ రెడ్డి, ఇమ్మడి రాకేష్ యాదవ్,నగరపు రమేష్, చందా జ్యోతి, దొంతిరెడ్డి రాకేష్ రెడ్డి, చింతలపూడి కొండా రెడ్డి, కొత్త సురేందర్, రమేష్ రెడ్డి, ఆవుల ప్రశాంత్ రెడ్డి, కొత్త ప్రశాంత్, శివ, మహేష్, ప్రవీణ్, కట్ట సాయి రెడ్డి, శ్రీధర్, కందికొండ కుమార్, బోడ అంజిత్, కవ్వంపల్లి బాబు లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన దుర్గామాత
Written by telangana jyothi
Published on: