దసరా దగ్గరకు వచ్చినా వంట కార్మికులకు అందని పెంచిన వేతనాలు
ములుగు ప్రతినిధి : ఏఐటియూసీ అనుబంధ తెలంగాణ మధ్యాహ్నం భోజన పథకం వర్కర్స్ యూనియన్ హెచ్ 80 ఆధ్వర్యంలో మంగపేట మండల మహసభ ఎండి ఫర్వీణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహసభకు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పాఠశాలల్లో వంట కార్మికులుగా గత 22 సంవత్సరాలుగా వంటలు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తూ వంట కార్మికులు మాత్రం కేవలం 1000 రూపాయల వేతనంతో పనిచేస్తున్నారన్నారు. అనేక పోరాటాల ఫలితంగా ముఖ్యమంత్రి 2 వేలు అధనముగా పెంచుతూ రూపాయలు 3 వేలు అందిస్తామని 2022 ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రకటించారన్నారు. ఆ తర్వాత జరిగిన పోరాటాలతో జీవో నెంబర్ 8 విడుదల చేస్తూ వేతనం అందిస్తామన్నారు. వేతనాలు నేటికీ కార్మికులకు అందలేదన్నారు. మరి కార్మికులు ఎలా వంటలు చేయాలో ప్రభుత్వమే ఆలోచించాలన్నారు. అది కాక ప్రస్తుతం ముఖ్యమంత్రి అల్పాహారం అనే పథకాన్ని ఎలాంటి విధివిధానాలు లేకుండా, వంట కార్మికుల శ్రమ ప్రస్తావన లేకుండా ప్రకటించారు. అది తయారు చేయాలి అంటే రూపాయలు మూడు వేలు సరిపోతుంద అని అన్నారు. కనీస వేతనంగా రోజుకు రూపాయలు 500 రూ. అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ మంగపేట మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజకుమారి, పద్మ, జయమ్మ, రాములు, భారతి, లక్ష్మి, అఖిల, శ్రీదేవి, సమ్మక్క,హనీ, సమ్మక్క, సుధా, సారాబాయి, నాగేంద్ర, తులసి, అమీన, సుశీల, విజయ, లక్ష్మి, లాలమ్మ, మానిఖ్యం, అమీన ఉమ,ఖైరున్, వెంకటరమణ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.