Modi | వేములవాడ రాజన్నను దర్శించుకున్న మోధీ
– దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి
– వేములవాడ రాజన్న ప్రధాని దర్శించుకోవడం ఇదే ప్రథమం
తెలంగాణ జ్యోతి, వేములవాడ ప్రతినిధి : వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామి ఆలయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడి సందర్శించారు. బుధవారం లోకసభ ఎన్నికల ప్రచారం లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్ల వేములవాడలో పర్యటిం చారు ప్రధాని. వేములవాడలో హెలిక్యాప్టర్ దిగిన తరువాత నేరుగా రాజన్న క్షేత్రానికి చేరుకున్న ఆయన కోడె మొక్కు చెల్లించుకున్నారు. గర్భాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రధానికి ఆశీర్వచనాలు అందజేశారు.
– రాజన్నను దర్శించుకున్న తొలి ప్రధాని…
దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఓ ప్రధాని దర్శించుకోవడం ఇదే ప్రథమం. చాళు క్యల రాజధానిగా కూడా వెలుగొందిన రాజన్న క్షేత్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ ఆల యాన్ని ఎంతో మంది పండితులు, పీఠాధిపతులు, ప్రము ఖులు దర్శించుకున్నారు. కానీ ప్రధాని హోదాలో ఉన్న వారు దర్శించుకోలేదు. ఆ రికార్డును ఒక్క నరేంద్ర మోడికి మాత్రమే దక్కింది.
జై శ్రీరామ్… జై శ్రీరామ్… అంటూ నినదించిన భక్తులు
గర్భాలయం వద్దకు చేరుకున్న ప్రధాని మోడీ ప్రదక్షిణలు చేస్తుండగా క్యూ లైన్లలో ఉన్న భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లి పోయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ భక్తులు ఇచ్చిన నినాదాలతో బారీగేట్ల సమీపం వరకు చేరుకున్న ప్రధాని వారికి అభివాదం చేస్తూ ప్రదక్షిణలు కొనసాగించారు.
1 thought on “Modi | వేములవాడ రాజన్నను దర్శించుకున్న మోధీ ”