అదృశ్యమైన వివాహిత మృతదేహంగా లభ్యం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం శివాలయం బజార్ కు చెంది న పానెం పద్మావతి 40 అనే వివాహిత ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే ఈ మేరకు ఆమె బంధువులు వెంకటాపురం సోషల్ మీడియాలో వివాహిత పానెం పద్మావతి కనపడుట లేదని ఆమె ఫోటోతో ఆచూకీ తెలిసిన వారు సెల్ నెంబర్ లకు తెలియజేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వెంకటాపురంను ఆనుకొని ఉన్న కంకల వాగు మడుగు లో నీటి పై ఆ మె మృతదేహం తేలి ఉండటంతో హుటాహుటిన అక్కడికి బంధువులు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పద్మావతి భర్త పంపు మెకానిక్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. వారికి ఇద్దరు పిల్లలని తెలిసింది. ఆమె మృతి పట్ల కారణాలు పూర్తిగా తెలియ రాలేదు. ఆమె మృతదేహాన్ని బుధవారం ఉదయం వాగు నుండి వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.