దాతృత్వం చాటుకున్న మంత్రి సీతక్క
ములుగు, జనవరి07,తెలంగాణ జ్యోతి: అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబానికి అండగా నిలిచి దాతృత్వాన్ని మరోసారి మంత్రి సీతక్క చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట రాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఈసం ఇందిర తల్లి ఈసం బుచ్చమ్మ అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న వెంటనే స్పందించారు. సోమవారం బాధిత కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి, తన పీఏను హనుమకొండలోని మాక్స్‌కేర్ ఆస్పత్రికి పంపించి వైద్యులతో చర్చించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం బుధవారం ఉదయం తన కోడలు కూసుమంజలిని ఆస్పత్రికి పంపి బాధిత కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అధైర్య పడవద్దని, తమ అండ ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి బాధితులకు భరోసా ఇచ్చారు.





