మృతుల కుటుంబాలను మంత్రి దుద్ధిల్ల ఆదుకోవాలి
– బీజేపీ నాయకులు చల్లా నారాయణ రెడ్డి
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: మహాదేవపూర్ మండలం బీరసాగర్ గ్రామానికి చెందిన జైన మధునయ్య నిన్న రాత్రి ఉట్లపల్లికి వెళ్లి వస్తున్న క్రమంలో అడ్డగోలుగా జీరో ఇసుక రవాణా చేస్తున్న క్రమంలో లారీ ఢీ కొట్టి అక్కడికక్కడే మరణించారని భార తీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డి అన్నారు. ఈ ఘటనకు కారణమైన పూసుకుపల్లి క్వారీ నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యత పూర్తిగా మన ప్రాంత శాసనసభ్యులు, మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు బాధ్యత వహించాలనీ చల్ల అన్నారు. ఎన్నికల ముందు అక్రమంగా సాండ్ మాఫియా జరుగుతుందని, మా ప్రభుత్వం వచ్చాక ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నిషేధిస్తామని ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకీ వచ్చిన శ్రీధర్ బాబు, మీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అక్రమ రవాణలకు అడ్డాగా మారిందనీ చల్ల నారాయణ రెడ్డి ఆరోపించారు. మంథని, కాళేశ్వరం, మహాదేవపూర్, కాటారం ప్రాంత జనాలను మభ్యపెట్టి, ఆశచూపి అధికారంలోకి వచ్చాక కనీసం ప్రజలను పట్టించుకున్న నాదుడే లేడనీ విమర్శించారు. నీ సొంత నియోజకవర్గం నీ మిత్రులు, బంధువుల కన్ను సన్నలలో అధికారులను బెదిరిస్తూ, అక్రమ వ్యవహారం నడిపిస్తున్నారనీ అన్నారు. ఈ రోజు ఆక్సిడెంట్ లో మరణిం చిన జైన మధునయ్య కుటుంబానికి టీ ఎస్ ఎం డి సీ తరుఫు న, మీ కాంగ్రెస్ ప్రభుత్వం తరుఫున మృతుని కుటుంబానికి 20 లక్షల రూపాయలను ఎక్సగ్రేషియా ఇవ్వాలని బీజేపీ పార్టీ తరుఫున మేము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రోజు 500వందల లారీలలో కనీసం 200 లారీలకు పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నారనీ ఆరోపించారు. ఇక్కడ పీ ఓ గా విధులు నిర్వహిస్తున్న పీ ఓ తారక్ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి బీజేపీ పక్షాన తోడుగా ఉంటాం, కొట్లాడుతామని స్పష్టం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి దైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ మాజీ ఎంపీటీసీ చాగర్ల రవీందర్, కొక్కు శ్రీనివాస్, ఐలయ్య యాదవ్, మనోజ్, జనగాం పోశం, రాకేష్, జోగేష్, సుమన్ బీజేపీ నాయకులు ఉన్నారు.