Michaung | గోదావరి నదిలో విపత్తు ప్రతి స్పందన సిబ్బంది రిహార్సల్స్
– మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆదేశం
– విపత్తు ప్రతిస్పందన సిబ్బంది అప్రమత్తం.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : మిచౌంగ్ తుఫాన్ను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు గోదావరి నదిలో విపత్తు ప్రతి స్పందన సిబ్బంది రిహార్సల్స్ నిర్వహించారు. ప్రజలను వరదల నుండి కాపాడుకునేందుకు చేసే సన్నాహక కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా పోలీస్ సూపర్తెండెంట్ గౌస్ ఆలం ఆదేశంపై విపత్తు ప్రతిస్పందన సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు ములుగు జిల్లా వాజేడు మండలం ముల్లెకట్ల గోదావరి వంతెన వద్ద బుధవారం సాయంత్రం విపత్తు ప్రతిస్పందన సిబ్బంది ప్రత్యేక ఐఆర్ బోట్లో వరద సమయంలో ప్రజలను కాపాడుకునేందుకు చేయవలసిన ముందుస్తు జాగ్రత్తల తో రిహార్సల్స్ ట్రయల్ ను నదిలో నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశంపై గోదావరి నదిలో ఏటూరునాగారం, వాజేడు పోలీస్ అధికారుల సమక్షంలో ఐ.ఆర్.బోట్ లో ట్రయల్ నిర్వహించారు. తుఫాను భారి వర్షాలు.ను దృష్టిలో పెట్టుకొని ముందుస్తు జాగ్రత్త లో భాగంగా ప్రజలను వరదల నుండి ప్రాణాపాయం నుండి కాపాడుకునేందుకు, జిల్లా ఎస్పీ ప్రభుత్వ ఆదేశం పై విపత్తు ప్రతిస్పందన సిబ్బందిని, ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేశారు. తుఫాను సందర్భంగా ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ, వరదలు సమయంలో విపత్తు ప్రతిస్పందన సిబ్బంది రెయంబవళ్ళు సిద్ధంగా ఉండేందుకు ఏర్పాటు లు గావించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ప్రత్యేక ఐ.ఆర్ బోట్ లో గోదావరి నదిలో ట్రయల్ నిర్వహించారు. తుఫాను సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని, వరదల సమయంలో సహాయ చర్యలు చేపట్టేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో ,ప్రజలకు అండదండగా ఉంటుందని ఈ సందర్భంగా పోలీసు అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎటునాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, మరియు వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తోపాటు, జిల్లా పోలీస్ విపత్తు ప్రతిస్పందన సిబ్బంది పాల్గొన్నట్లు వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు మీడియాకు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.