ప్రజలకు సేవాభావంతో వైద్యం అందించాలి
– భారం ఉన్నా బాధ్యతగా పనిచేయాలి
– తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్
ములుగు ప్రతినిధి : ఆరోగ్య సిబ్బంది, వైద్యులు సేవాభావం తో పనిచేయాలని, భారంగా ఉన్నా బాధ్యతగా పనిచేయాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్, పరిశీలకులు డాక్టర్ అజయ్ కుమార్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య ఆసుపత్రుల పనితీరు పరిశీలకుడిగా ములుగుకు వచ్చిన డాక్టర్ అజయ్ కుమార్ ఏరియా ఆస్పత్రి, ములుగు మెడికల్ కాజేజీ, ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రి, ఆత్మకూరు, గోవిందరావుపేట, పస్రా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. ములుగు, ఏటూరునాగారం ఆసుపత్రులలో అన్ని వార్డులు తిరిగి పేషెంటు, వారి బందువులను వైద్య సేవలు, భోజన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడిన కమిషనర్ ఆసుపత్రులలో మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది ప్రజల కోసం పని చేయాలని, పని భారం ఉన్నా కూడా బాధ్యత మరువకూడదన్నారు. సేవే జీవిత లక్ష్యంగా పని చేయాలని సూచించారు. మందులు నిరంతరాయంగా సరఫరా కావడానికి, సిబ్బంది కొరత తీర్చడానికి అన్ని రాకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డీసీహెచ్ఎస్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ జగదీశ్వర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ లాల్, ఆర్ఎంవో ప్రవీణ్ రెడ్డి, ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్, వైద్యులు రఘు, చంద్రశేఖర్, వినయ్, భిక్షపతి రావు, నర్సింగ్ సూపరింటెండెంట్ ఇందిర, వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.