రంగాపూర్ లో వైద్య శిబిరం – శీఘ్ర నిర్ధారణ పరీక్షలు

Written by telangana jyothi

Published on:

రంగాపూర్ లో వైద్య శిబిరం – శీఘ్ర నిర్ధారణ పరీక్షలు

తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : సీజనల్ వ్యాధులు ప్రబల కుండా రంగాపూర్ లో ప్రత్యేక వైద్య శిబిరాన్ని కాటాపూర్ పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ రంజిత్ ఆదేశాల మేరకు రంగాపూర్ సి హెచ్ ఓ జి.సాయి ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. ఈ సందర్భంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సిబ్బంది రంగాపూర్‌ లోని ఎస్సీ కాలనీలో శీఘ్ర నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, ఇంటింటికి జ్వర సర్వేను నిర్వహించా రు. అదేవిధంగా దోమల కాటు నుండి తీసుకోవాల్సిన రక్షణ లను, అధిక నీటి నిల్వ, లార్వా అభివృద్ధి గురించి వివరిం చారు. అత్యవసర పరిస్థితుల్లో కాటాపూర్‌ పీహెచ్‌సీని సంప్ర దించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ రంగాపూర్ ఎం ఎల్ హెచ్ పి/ సి హెచ్ ఓ సాయి, హెచ్‌ఏ ఎల్లారేశ్వరి, ఆశ రత్న కుమారి లు పాల్గొన్నారు.

Leave a comment