కొండాయి గ్రామంలో వైద్య శిబిరం
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : మండలంలోని దొడ్ల- కొండాయి గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో కొండాయి గ్రామానికి చెందిన పాయం స్నేహా గర్భిణీ స్త్రీ నొప్పులతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొన్న డాక్టర్ హెచ్ ప్రణీత్ తాడ్వాయి మండలంలోని ఊరట్టం గ్రామంలోని మట్టి బురద, వర్షాన్ని లెక్క చేయకుండా కొండాయి గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులకు వైద్య శిబిరం ఏర్పాటుచేసి రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందించారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీని ఏటూరు నాగారం సిహెచ్సి కి 108 ద్వారా తీసుకువచ్చి చేర్పించారు. నడవలేని విధంగా ఉన్న రోడ్డును దాటి ఊర్లోకి వచ్చిన డాక్టర్ను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, సమ్మక్క, సెక్రెటరీ సతీష్,హెల్త్ అసిస్టెంట్ భాస్కర్ లు పాల్గొన్నారు.