Medaram | మేడారం పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి
– భక్తులు సంతృప్తిగా అమ్మవార్లను దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలి.
– పర్యావరణ అనుకూలంగా, ప్లాస్టిక్ ఫ్రీగా మేడారం జాతర.
– జనవరి నెల 20 నాటికి మేడారం పనులన్నీ పూర్తి చేయాలి : మంత్రి సీతక్క
ములుగు, తెలంగాణ జ్యోతి : మూడురోజుల్లోనే దాదాపు కోటిన్నర భక్తులు సందర్శించుకునే సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరను ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ & స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. 2024 ఫిబ్రవరి 21, 22., 23, 24 తేదీల్లో నిర్వ హించనున్న మేడారం జాతర పనుల పురోగ తిపై ఆర్ అండ్ బి, పంచాయ తీరాజ్, నేషనల్ హైవేస్, అటవీ శాఖ, గిరిజన శాఖ, తదితర శాఖ అధికారులతో మంత్రి రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ & స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క మేడారంలోని ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా ముందుగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పి గౌస్ ఆలం లు జాతర ఏర్పాట్ల గురించి మంత్రికి వివరించా రు. మేడారం జాతరకు ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యం లో భక్తుల తాకిడి జనవరి చివరి వారం నుంచే మొదలవుతు న్నందున, మేడారం జాతర పనులన్నీ జనవరి 20 నాటికి పూర్తి చేయా లని అధికారులను మంత్రి సూచించారు. ఒక టీమ్ గా, కుటుంబ సభ్యులు గా పని చేయాలన్నారు. అనుకు న్న సమయంలో పనులు కచ్చితంగా పూర్తి చేయాలన్నారు. నిధులను అవసరమైన చోట వినియోగించి, పైసా కూడా వృధా కారాదని, నాణ్యత లో రాజీ వద్దని మంత్రి తెలిపారు. ములుగు జిల్లా ప్రధానంగా వ్యవసాయం పై ఆధారపడినది కావడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రభు త్వం రైతులకు అందించే ప్రతి పథకం లబ్దిదారులకు చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మేడారం జాతరకు వచ్చే భక్తులకు రవాణా విషయంలో ఇబ్బందులు ఉండకుండా రోడ్లను వేయడానికి, మరమ్మత్తుల చేయడానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబం ధిత శాఖల ఉన్నతాధికారులకు సూచించారు. మేడారంలో భక్తులకు పార్కింగ్ విషయంలోనూ, వసతుల కల్పనల్లోనూ ఎలాంటి కొరత ఉండకుండా ఏర్పాటు చేయడంలో అటవీ శాఖ అనుమతులు సానుకూలంగా స్పందించాలన్నారు. గిరిజనులకు సంబంధించిన మేడారం జాతరఆసియా ఖండం లోనే అతిపెద్ద జాతర అని, ఇందులో గిరిజనుల సంప్రదా యాలను చాటిచెప్పే విధంగా జాతరలో ఏర్పాట్లు చేయాల న్నారు. పోలీసు శాఖ నుండి జాతరలో ఎటువంటి అవాంఛనీ య సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా అన్ని విధాలు గా చర్యలు తీసుకావాలని మంత్రి తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత తో మేడారం జాతరను ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడు తూ తెలంగాణ సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక మాంధ్యం ఉన్నా. ..ఈసారి మేడారం జాతరకు 75 కోట్ల రూపాయలను ఇవ్వ డం పట్ల ఆయనకు ధన్యవాదాలన్నారు. ఈసారి ఈ 75 కోట్లలో జాతరకు వచ్చే భక్తుల వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఖర్చు చేయనున్నామని అన్నారు. మొత్తం గా ఈసారి మేడారం జాతరకు వచ్చే భక్తులు అమ్మవార్లను సంతృప్తిగా సందర్శించుకునే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపా రు. ఈ సమావేశం లో ఎంపి మాలోతు కవిత, జెడ్పీ చైర్మన్ నాగజ్యోతి, ఐ టి డి ఎ పి ఓ అంకిత్, అదనపు కలెక్టర్ లోకల్ బాడిస్ శ్రీజా, అదనపు కలెక్టర్ డి. వేణు గోపాల్, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, మేడారం పూజారి జగ్గారావు, ప్రజా ప్రతినిధు లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
1 thought on “Medaram | మేడారం పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి”