అమాయకులను టార్గెట్ చేస్తున్న మావోయిస్టులు :ఎస్పీ శబరిష్ 

అమాయకులను టార్గెట్ చేస్తున్న మావోయిస్టులు :ఎస్పీ శబరిష్ 

అమాయకులను టార్గెట్ చేస్తున్న మావోయిస్టులు :ఎస్పీ శబరిష్ 

     ములుగు ప్రతినిది :  వెంకటాపురం మండలంలో వీరభద్రవరం ముత్యందార జలపాతం సమీపంలో పేలిన ప్రెజర్ బాంబు ఘటనపై ములుగు ఎస్పీ శబరిస్ స్పందించారు. మందుపాతర పేలి అమాయక ఆదివాసీ యువకుడికి తీవ్ర గాయలయ్యా యని, అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించే అమాయక ఆదివాసీల ప్రాణాలను మావోయిస్టులు బలిగొంటున్నారన్నారు. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడంలో బాగంగా సాధార ణ ప్రజలను, యాత్రికులను, భక్తులను, అటవీ ఉత్పత్తుల సేకరణకి వెళ్లే ఆదివాసీలను సైతం టార్గెట్ చేస్తూ ప్రజలు నిత్యం నడిచే కాలి బాటల వెంబడి మందుపాతరలను అమర్చి వారి ప్రాణాలను బలిగొంటున్నారన్నారు. కర్రేగుట్టలను గేర్రిల్లా బేస్ గా మార్చే ప్రయత్నంలో బాగంగా మావోయిస్టులు అమాయక ప్రజలను టార్గెట్ చేస్తు మందుపాతరలు అమర్చుతున్నార న్నారు. వెంకటాపురం, వాజేడు మండలలోని ప్రజలు అటవీలోకి వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏమైనా అనుమా నస్పదంగా మందుపాతరలు కనిపిస్తే వెంటనే పోలీసులకి సమా చారం ఇవ్వాలని ములుగు ఎస్పీ శబరిస్ ప్రజలకి తెలిపారు. ప్రజలు ఎవరు బయపడవద్దని ములుగు ప్రజల రక్షణ కోసం ములుగు పోలీస్ నిరంతరం పనిచేస్తున్నారని, బాంబు డిస్పో జల్ తనిఖీ బృందాలతో నిరంతరంగా కర్రేగుట్ట అటవీ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్నారన్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక పనులకి పాల్పడుతున్న మావోయిస్టులకి ప్రజలు ఎవరు సహకరించ వద్దన్నారు. ఇటువంటి అమాయక ఆదివాసీల మీద జరుగు తున్న దాడులు పునరావృతం కాకుండా ప్రజా సంఘాలు ఈ సంఘటనపై స్పందించాలని ములుగు ఎస్పీ శబరిష్ తెలిపారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment