ములుగు ఏజెన్సీలో మావోల అలజడి..!
– ఇన్ ఫార్మర్ నెపంతో గొడ్డలితో నరికి చంపిన వైనం…
– పలుమార్లు హెచ్చరించిన మారని తీరు అంటూ లేక విడుదల
– మృతుల్లో పేరూరు పంచాయతీ కార్యదర్శి రమేష్
ములుగుప్రతినిధి: మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములు గు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీలో మావోయిస్టులు ఘాతుకాన్ని సృష్టించారు. పోలీసుల ఇన్ఫా ర్మర్ నేపంతో ఇద్దరు గిరిజనులను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. మృతుల్లో ఒకరైన ఉయిక రమేష్ పేరూరు పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఉయిక అర్జున్ అనే గిరిజన వ్యక్తిని కూడా సుమారు రాత్రి 11.30 నిమిషాల సమయంలో సాయుధులైన ఆరుగురు మావోయిస్టులు రెండు గ్రూపులుగా విడిపోయి ఇద్దరినీ ఒకే సమయంలో గొడ్డలితో నరికి చంపారు. ఉయిక అర్జున్ అక్కడికక్కడే మృతి చెందగా రమేష్ కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతుండగా కుటుంబ సభ్యులు 108 సహాయం తో ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా మారి గత కొద్ది సంవత్సరాలుగా మావోయిస్టు కదలికలను పోలీసులకు చేరవేస్తూ మావోయి స్టులపై దాడులకు కారకులు అయ్యారని పలుమార్లు హెచ్చ రించిన పద్ధతి మార్చుకోకపోవడంతో హతమార్చడం జరిగిం దని వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరుతో లేఖ లో పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మండల కేంద్రంలోనే…
ఇప్పటి వరకు ములుగు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాలకే పరిమితం అయిన మావోయిస్టు పార్టీ ఉనికి ఏకంగా మండల కేంద్రంలో బయటపడడం సంచలనంగా మారింది. వాజేడు మండల కేంద్రాన్ని ఆనుకుని ఉన్న పెనుగోలు కాలనీకి చెందిన ఇద్దరిని పోలీస్ ఇన్ ఫార్మర్ పేరిట నక్సల్స్ హత్యం చేయడం కలకలం లేచింది. అయితే ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములపై ఆరోపించేందుకు వచ్చిన దళం వేర్వేరుగా లేఖలు వదిలేయడం కొత్త ఆనవాయితిని అమలు చేస్తున్న ట్టుగా అనిపిస్తోంది. పంచాయితీ కార్యదర్శి రమేష్, అతని సోదరుడు అర్జున్ ను టార్గెట్ చేసేందుకు వచ్చిన మావోయి స్టు పార్టీ నక్సల్స్ వేర్వేరుగా లేఖలు వదలి వెల్లడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్నదే అంతుచిక్కడం లేదు. గతంలో టార్గెట్లను హతం చేసిన తరువాత ఆ ఘటనలో ఎంత మందిని చంపితే వారి వివరాలను వెల్లడిస్తూ ఒకే లేఖలో వెల్లడించేవారు. కానీ వాజేడు మండల కేంద్రంలో మాత్రం మావోయిస్టులు అన్నదమ్ములను హతం చేసి వేర్వేరుగా లేఖలు వదిలేయడం గమనార్హం.