మంథని బరిలో మరో బీసీ నేత

మంథని బరిలో మరో బీసీ నేత

– తెలుగుదేశం నుండి అందె భాస్కరాచారి

తెలంగాణ జ్యోతి , కాటారం ప్రతినిధి: త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నుండి మరో బీసి నేత బరిలో నున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈసారి తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందనే విషయం విదితమే. కాగా 1987 నుండి విద్యార్థి నాయకునిగా తెలుగుదేశం పార్టీలో చేరిన సీనియర్ నాయకుడు “విశ్వకర్మ సామాజిక వర్గానికి” చెందిన అందె భాస్కరాచారి పేరును తెదేపా పార్టీ అదిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మంథని రాజకీయాలు బహుజనుల చుట్టూ తిరుగుతున్న నేపద్యంలో బహుజన వాదం బలంగా వినిపిస్తున్న తరుణంలో రాజకీయాలకు ఆమడ దూరంలో ఉన్న విశ్వకర్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి టిడీపి టికెట్ కెటాయింపునకు పరిశీలిస్తుండటం తో మరో సారి తెలుగుదేశం పార్టీ బడుగుల పక్షమేనని నిరూపించుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .భాస్కరాచారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుపరిచితుడు కావడం, దశాబ్ద కాలం పాటు ఆంద్రజ్యోతి లాంటి ప్రముఖ దినపత్రికలో జర్నలిస్ట్ గా పని చేసిన అనుభవం తో పాటు అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నిత్యం ప్రజాసేవతో తూర్పు డివిజన్ లో ప్రతీ గడపగడపకు పరిచయం ఉన్నవాడు. అంతే కాకుండా 2006, 2014 సంవత్సరం లలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీ ఫామ్ పై మహముత్తారం జడ్పీటీసీ సభ్యుని గా పోటీచేసారు. 2006-2013 వరకు భాస్కరాచారి సతీమణి అందె సంద్యారాణి మండలంలోని బోర్లగూడెం యంపిటీసి గా తెలుగుదేశం పార్టీలో గెలుపొందారు. భాస్కరాచారి విశ్వకర్మ హక్కుల పోరాట సమితి లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రదాన కార్యదర్శి గా పని చేసి మంథని నియోజకవర్గం లోని విశ్వకర్మల అందరి బందువు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు సుపరిచితుడు. ఈ నియోజకవర్గంలో సుమారు 15 వేల ఓట్లు ఉన్న విశ్వకర్మ సామాజిక వర్గం నుండి తొలిసారిగా తెలుగుదేశం పార్టీ ఎంఎల్ఏ టిక్కెట్ కెటాయిస్తుండటం పట్ల ఆ సామాజిక వర్గం వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా యల్ఐసీ, శ్రీరామ్ లైఫ్ ఇన్స్యూరెన్స్, స్టార్ హెల్త్ ఇన్స్యురెన్స్ లలో అనేక మంది పాలసీ దారులను కలిగి ఉండటం విశేషం. అదీ పోను 1994 లో చందుపట్ల రాంరెడ్డి తెలుగుదేశం పార్టీ ఎంఎల్ఏ గా ఉన్న సమయంలో ఆయనకు కుడిభుజం లాగా భాస్కరాచారి పని చేసారు. అటు తర్వాత స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి, సుద్దాల దేవయ్య, ఇనుగాల పెద్ది రెడ్డి, ములుగు ఎంఎల్ఏ లు అజ్మీరా చందూలాల్, సీతక్క, ఎర్రబెల్లి దయాకరరావు, అప్పటి పెద్దపెల్లి యంపీ చెలిమెల సుగుణకుమారి ల కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు పేరుపెట్టి పిలిచే సాన్నిహిత్యం ఉన్న భాస్కరాచారి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పెద్దపెల్లి పార్లమెంట్ ఉపాద్యక్షులు గా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ అద్యక్షుడు బి సంజయ్ కుమార్, పరిశీలకులు వెజెండ్ల కిశోర్ బాబు అండదండలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదీఏమైనా తూర్పు డివిజన్ లోని మారుమూల అటవి ప్రాంతం కు చెందిన అందె భాస్కరాచారి పేరును అదిష్టానం పరిశీలించటం సర్వత్రా సంచలనం రేపింది.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment