రాజకీయ పార్టీల దిమ్మలకు, నేతల విగ్రహాలకు ముసుగులు.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ఎలక్షన్ కమీషన్ కోడ్ అమల్లో ఉండటంతో, ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలోని వివిధ రాజకీయ పార్టీల కు చెందిన పార్టీ జెండాలను, పతాకాలను వెంకటాపురం మేజర్ పంచాయతీ సిబ్బంది బుధవారం సాయంత్రం తొలగించారు. అలాగే వెంకటాపురం ప్రధాన మార్కెట్ సెంటర్, బస్టాండ్, వేప చెట్టు సెంటర్ ఇతర ప్రాంతాల్లో ఉన్న స్వర్గీయ రాజకీయ నేతల విగ్రహాలకు సైతం ముసుగులు కట్టారు. ఎన్నికల ప్రవర్తన నియమ నిబంధనల ప్రకారం ఎలక్షన్ కమిషన్ ములుగు జిల్లా యంత్రాంగం ఆదేశంపై,అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించి న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించడంతో, వెంకటాపురం మండలంలో మరియు వాజేడు మండలాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైన మట్లు సమాచారం.