వాజేడు హైస్కూల్లో మండల స్థాయి ఆంగ్ల ప్రతిభా పాటవ పోటీలు
వెంకటాపురం నూగూరు, జనవరి 2 (తెలంగాణ జ్యోతి): వాజేడు హైస్కూల్లో మండల స్థాయి ఆంగ్ల ప్రతిభా పాటవ పోటీలు ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగారం నందు ఇంగ్లీషు భాషా టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల విభాగాల్లో సీనియర్స్, జూనియర్స్ కేటగిరీలలో ఒలింపియాడ్ రాత పరీక్షలు, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మండల స్థాయి నుంచి మొత్తం 8 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో సీనియర్స్ కేటగిరీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆర్. లోకేష్, సిహెచ్. మహేష్, జూనియర్స్ కేటగిరీలో ఎ. బిల్వనాథ్, ఎన్. నిశిత ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఆశ్రమ ఉన్నత పాఠశాలల విభాగంలో సీనియర్, జూనియర్ కేటగిరీలలో పెద్ద గొల్లగూడెం ఆశ్రమ పాఠశాల విద్యార్థులు బి. జ్యోత్స్న, బి. లక్ష్మి వినిత, టి. జాహ్నవి, యు. అక్షరలు ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోయం ఆనందరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో పోరిక స్వరూప్ సింగ్, ఆంగ్ల ఉపాధ్యాయులు చల్లగురుగుల మల్లయ్య, బుచ్చిబాబు, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.






