ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం శివారు బీసీ మర్రిగూడెం గ్రామానికి చెందిన పూనెం రంజిత్ (26) ఉరివేసుకొని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. మృతుని కుటుంబసభ్యులు, పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. రంజిత్ గత కొంతకాలంగా మద్యానికి బానిసై తాగి ఇంటికి వస్తూ కుటుంబ సభ్యులతో గొడవపడే వాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో తాగి ఇంటికి వచ్చిన రంజిత్ భార్యతో గొడవపడ్డాడు.మద్యం తాగొద్దని, కుటుంబాన్నిఎలా పోషించు కుంటామని నిలదీయడంతో మనస్థాపం చెందిన రంజిత్ భార్య ఇంటివద్ద లేని సమయంలో తాగిన మైకంలో ఇంట్లోని దూలానికి చీరతో ఉరి పెట్టుకుని మృతి చెందాడు. మృతుని తల్లి పూనెం సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటాపురం ఎస్సై కె.తిరుపతిరావు మీడియాకు తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment