భూ తగాదాలతో వ్యక్తి దారుణ హత్య 

భూ తగాదాలతో వ్యక్తి దారుణ హత్య 

– కళ్ళల్లో కారం చల్లి గొడ్డల్లతో నరికివేత

    కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపా లపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శనివారం కాటా రం మండలంలోని రేగుల గూడెం శంకరంపల్లి గ్రామాల మధ్య ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అన్నదమ్ముల మధ్య భూ తగాద చిలికి చిలికి గాలి వాన లాగా తయారై హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. దేవరంపల్లి గ్రామానికి చెందిన మారపాక సారయ్య (50) అనే వ్యక్తి బైక్ పై తన కొడుకుతో పాటు వెళుతుండగా తన తమ్ముడి కుటుంబ సభ్యులు దారి కాచి, కళ్ళల్లో కారం చల్లి, గొడ్డల్లతో మెడపైన నరికి వేశారు. ఈ ఘటనలో బైక్ వెనుకనున్న సారయ్య కుమారుడు అక్కడి నుంచి తప్పించుకొని బయట పడ్డాడు. ఈ విషయం ధావనం లాగా వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు భయకంపితు లవుతున్నారు. సంఘటన స్థలాన్ని కొయ్యూరు ఎస్సై నరేష్ సందర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నా రు.భూతగాదాలే హత్యకు కారణమని భావిస్తున్నట్లు పోలీసు లు వెల్లడించారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment