వెంకటాపురం మండలానికి మహార్దశ

వెంకటాపురం మండలానికి మహార్దశ

– రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వం కృషి

– వెంకటాపురం కేంద్రంగా నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు

– భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు ప్రకటన

వెంకటాపురంనూగూరు, తెలంగాణ జ్యోతి : రైతాంగ సంక్షేమ మే ప్రభుత్వ ధ్యేయమని అందులో భాగంగానే భద్రాచలం నియోజకవర్గంలోని ములుగు జిల్లాలో ఉన్న వెంకటాపురం, వాజేడు మండలాలకు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసేందుకు త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ నున్నాయని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు. మంగళవారం వెంకటాపురం లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసేందుకు అతి  జీవో విడుదల కానునట్లు తెలిపారు. దశాబ్దాల కాలం క్రితం అప్పటి మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు జలగం వెంగళరావు హయాంలో నూగూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేశారు. కాలక్రమంలో వెంకటాపురంలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని చర్లకు మార్చారు. దశాబ్దాలు కాలంగా అక్కడే కొనసాగుతున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రధాన కార్యలయం ఉన్న చర్ల, జిల్లాల విభజనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతున్నది. వాజేడు వెంకటాపురం చర్లకై మూడు మండ లాలు ఏఎంసి చెర్లలో కొనసాగుతున్నాయి. కాగా రైతుల సంక్షే మం కోసం, రైతాంగ అవసరాల కోసం ములుగు జిల్లా వెంకటా పురం కేంద్రంగా వాజేడు వెంకటాపురం మండలాల ను కలిపి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని తెలిపారు.  వెంకటా పురంలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ మంజూరు చేసినందుకు పలువురు కాంగ్రెస్ నాయకులు, రైతులు, కార్యకర్త లు ఎంఎల్ఏ కు అభినందనలు తెలిపారు. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటుతో చైర్మన్, పాలక మండలి డైరెక్టర్ల కమిటీని త్వరలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నదని ఎమ్మెల్యే  తెల్లం వెంకటరావు తెలిపారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment