మహబూబాబాద్ జిల్లా పోలీసులు బేష్
– గంజాయి కేసులో నివృత్తిలో అత్యధిక పురోగతి
– 11 గంజాయి కేసులు పరిష్కారం, 39 మందికి శిక్ష
– డీజీపీ చేతుల మీదుగా రివార్డ్స్ అందుకున్న పోలీసులు
తెలంగాణజ్యోతి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యా లయంలో నిర్వహించిన రివార్డ్ మేళాలో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి కేసుల పరిష్కారంలో అత్యధికంగా మహబూబా బాద్ జిల్లా పోలీసులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అందుకు గాను రాష్ట్ర డిజిపి జితేందర్ అభినందించారు. గంజాయి కేసుల పరిష్కారం, నిందితులకు శిక్ష పడేలా చేయడంలో జిల్లా పోలీసులు కోర్టు కానిస్టేబుల్ నుంచి జిల్లా అధికారుల వరకు అత్యధికంగా కృషి చేయడంతో ఈ ఫలితం దక్కిందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అభినం దనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి కేసుల పరిష్కారంలో మహబూబాబాద్ జిల్లాలో 11 కేసులు పరిష్కరించబడ్డాయని 39 మందికి జైలు శిక్ష విధించబడినట్లు వెల్లడించారు. అందుకుగాను తెలంగాణ రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా రివార్డ్స్ అందుకోవడం సంతో షంగా ఉందన్నారు. డిజిపి చేతుల మీదుగా రివర్స్ అందు కున్న వారిలో మహబూబాబాద్ రూరల్ సీఐ సరవయ్య, మరి పెడ ఎస్. బి సతీష్, బయ్యారం ఎస్.ఐ తిరుపతిలు ఉన్నారు.