చింతగూడెంలో మడప సమ్మక్క నామినేషన్
కన్నాయిగూడెం, డిసెంబర్ 5, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని చింతగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ అభ్యర్థిగా మడప సమ్మక్క శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయం పూర్తిగా ప్రజల కోరిక మేరకేనని సమ్మక్క తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని, ప్రజల అవసరాలను ముందుగానే అంచనా వేసి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపిందని పేర్కొన్నారు. పార్టీ తరఫున ప్రజాసేవ చేసే అవకాశం దక్కడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, గ్రామ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉంటూ సేవలను కొనసాగిస్తానని సమ్మక్క అన్నారు. ఈ కార్యక్రమంలో చింతగూడెం బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు.





