ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలి

Written by telangana jyothi

Published on:

ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలి

– కలెక్టర్ రాహుల్ శర్మ 

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా నిష్పక్ష పాతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం కాటారం మండలం, కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్న ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. సర్వే నంబర్ 16, కంభం మధుకర్ స్థలంలో జరుగుతున్న ప్రక్రియ ఆన్లైన్ చేయు విదానాన్ని పరిశీలించారు. గిర్దావర్, ఇరిగేషన్, ఎంపీవోలు నమోదు చేసిన తదుపరి ఆన్లైన్ లో అదనపు కలెక్టర్ పరిశీలనకు వస్తాయని, అదనపు కలెక్టర్ పరిశీలన ఆమోదం తదుపరి కలెక్టర్ ఆమోదించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్థలానికి నాలుగు ప్రక్కల హద్దులు ఆన్లైన్ నమోదు చేసిన తదుపరి ఎంత మొత్తం చెల్లించాలో ధర నిర్ణయించబడుతుందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం చెల్లింపు చేయాల్సి ఉంటుందని, తదుపరి చెల్లింపు ప్రక్రియ జరగగానే ఆన్లైన్ ద్వారానే క్రమబద్ధీకరణ జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ఆర్ అండ్ బి విశ్రాంతి భవనంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఏర్పాటును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డిఓ మంగిలాల్, డిపిఓ నారాయణ రావు, తహసీల్దార్ నాగరాజు, ఎంపిఓ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment